YS Jagan: జనం పోరుకు సిద్ధం కావాలి... 3 d ago
AP: అనంతపురం జిల్లా నేతలతో తాడేపల్లిలో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో..ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని జగన్ విమర్శించారు. విజన్ 2047 పేరిట డ్రామా మొదలు పెట్టారని, ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోకే దిక్కులేదని ఏద్దేవా చేసారు. విజన్ అంటే మా ప్రభుత్వంలో తెచ్చిన సంస్కరణలు..ఆరోగ్య రంగంలోనూ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చామని గుర్తు చేసారు.
సచివాలయాల ద్వారా ప్రజల ఇంటి దగ్గరకే సేవలందించామని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్ వ్యవస్థ..ప్రతి ఎకరా ఈ-క్రాప్ చేయించామని చెప్పారు. రంగురంగుల కథలకు విజన్ అని పేరు పెడుతున్నారని, దాన్ని విజన్ అనరు..420 అంటారని జగన్ విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పెన్షన్లు కట్ చేశారని తెలిపారు. కొత్తగా ఏ ఒక్కరికీ పెన్షన్లు ఇవ్వలేదని..జనం పోరుకు సిద్ధం కావాలని జగన్ పిలుపునిచ్చారు.